![]() |
![]() |

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం అన్నట్టు.. ఎక్కడెక్కడో ఉన్నవారిని ఒక్క దగ్గరికి చేస్తుంది బిగ్ బాస్. అలా సీజన్ సిక్స్ లో శ్రీహాన్, ఇనయా, అర్జున్ కళ్యాణ్ కలిసారు. వీళ్ళు ఒకరికొకరు లోపలికి వెళ్ళేవరకు తెలియదు. లోపలికి వెళ్ళాక అందరు మంచి స్నేహితులుగా మారారు. శ్రీహాన్, ఇనయా, అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలుసుకోలేదు. కానీ తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా వీళ్ళు కలుసుకున్నారు.
సోహెల్ నటించిన బూట్ కట్ బాల్ రాజ్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్ తన ఫ్రెండ్స్ ని పార్టీకి పిలిచాడు. ఆ పార్టీకి జెస్సీ, దిశా పంత్, ఆర్జే కాజల్, సిరి హనుమంత్, శ్రీహాన్, ఇనయా సుల్తానా, అర్జున్ కళ్యాణ్, విజే సన్నీ, కుమార్ సాయి, మేఘ లేఖ అటెండ్ అయ్యారు. ఇక వీళ్ళు ఫుడ్ తినేమయందు తీసుకున్న ఫోటోలు అప్లోడ్ చేశారు. ఆ ఫోటోలని ఆర్జే కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఈ ఫోటోలు తీసింది దావత్ రెస్టారెంట్ స్టాఫ్.. అందుకే ఫుడ్ ఐటమ్స్ మీద పెట్టినంత ఫోకస్ మా మీద పెట్టలేదంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఉన్నవారిందరిని ట్యాగ్ చేసిన కాజల్ హోటల్ స్టాఫ్ ని కూడా కలిపింది. ఇనయా సుల్తానా, శ్రీహాన్, అర్జున్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోలని ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో షేర్ చేసుకున్నారు.
ఇక చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ ఓ దగ్గర కలిసారు. వాళ్ళే ఇనయా, శ్రీహాన్, అర్జున్ కళ్యాణ్.. సీజన్ సిక్స్ ముగిసాక శ్రీహాన్ ఎప్పుడు బయటకు రాలేదు. ఏ ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం లేదు. ఇనయా సుల్తానా ఊటీ , దుబాయ్ అంటు టూర్స్ కి వెళ్తూ బిజీగా ఉంది. ఇక అర్జున్ కళ్యాణ్ అయితే వెబ్ సిరీస్, షో అంటూ గడిపేస్తున్నాడు. తాజాగా గుంటూరు కారం సినిమాలోని 'ఆ కుర్చీని మడతబెట్టి' పాటకి.. అర్జున్ కళ్యాణ్, ప్రవళిక దామెర్లతో కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇలా ఎక్కడివాళ్ళు అక్కడ బిజీగా ఉండటంతో ఇలా మూవీ ప్రమోషన్ లో కలిసారు. ఇక సరదాగా కొన్ని ఫోటోలని దిగి తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఆ ఫోటోలు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
![]() |
![]() |